Radhika: రోజాపై బండారు వ్యాఖ్యలు.. రాధిక ఫైర్
YSRCP మంత్రి రోజాపై.. (roja) TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (bandaru satyanarayana murthy) చేసిన వల్గర్ కామెంట్స్‌పై నటి రాధికా శరత్‌కుమార్ (radhika) మండిపడ్డారు. ఒక సహ నటిగా, ఫ్రెండ్‌గా రోజా తరఫు నిలబడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైందంటే దాని అర్థం మరెందరో మహిళలు రాజకీయాల్లోకి వచ్చి భారతదేశాన్ని మరింత ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతోనేనని.. కానీ ఇలా పబ్లిసిటీ కోసం ఒక పార్టీకి చెందిన మహిళా మంత్రిపై మరో గౌరవనీయ పార్టీకి చెందిన నేత ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడాన్ని చూస్తుంటే రాజకీయాలు ఎంతకు దిగజారిపోయాయో అర్థమవుతోందని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రజాప్రతినిధి, నటి ఖుష్బూ (khushbu) కూడా రోజాకు మద్దతుగా నిలుస్తున్నట్లు వీడియో పోస్ట్ చేసారు. బండారుపై సరైన యాక్షన్ తీసుకుంటామని అన్నారు.