Rachamallu: 2029లో YSRCP పోటీ చేయదు
Rachamallu: ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 140 సీట్లలో గెలుస్తుందని అన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని అర్హతను ఈ భారతదేశంలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కానీ ఈరోజుల్లో దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని ఈవీఎంలే నిర్ణయిస్తున్నాయని విమర్శించారు.
“” అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఒకప్పుడు ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి ఎన్నికయ్యేవారు. ఇప్పుడు ఈవీఎంలు శాసిస్తున్నాయి. ఆ ఈవీఎంల వెనుక స్వార్థ రాజకీయ శక్తులు ఉన్నాయి. 2024లో జరిగిన భారతదేశ వ్యాప్తంగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీర్పు ఇవ్వలేదు. ఈవీఎంలే శాసించాయి. కౌంటింగ్ అయిపోయిన కొన్ని గంటలకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది అని చర్చించుకున్నారంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈవీఎంలను నిర్మూలించాలి.
ఇప్పుడు జరిగిన తీర్పును దర్యాప్తు చేయం.. ఈవీఎంల ద్వారానే రాజకీయాలు చేస్తాం అంటామంటే రాబోయే ఎన్నికల్లో ఇక ఎన్నికలు జరపడమే అనవసరం. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితేనే ప్రజా తీర్పు ఉంటుంది. హర్యాణా, ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా స్వార్థ రాజకీయ శక్తుల ప్రమేయంతోనే గెలిచారు. ప్రజా తీర్పుతో కాదు. మేం అస్సలు ఓడిపోలేదు. ప్రజా అభిమానం మాపై ఉంది. ఈవీఎంల వల్ల ఓడిపోయాం. ఈరోజు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు పెడితే మేం 130, 140 సీట్లు సులువుగా గెలుస్తాం. 2029లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తేనే మేం పోటీ చేస్తాం. లేకపోతే పోటీ చేయం “” అని తెలిపారు.