Putin: “మనకి ట్రాన్స్‌లేటర్ అవసరమా గురూ?”
Putin: భారత ప్రధాని నరేంద్ర మోదీ… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అందుకే మోదీతో పుతిన్ ఓ మాటన్నారు. మన స్నేహం చాలా దృఢమైనది.. మనకు ట్రాన్స్‌లేటర్ కూడా అవసరం లేదు అని మోదీతో అంటూ ఆయన ఆలింగనం చేసుకోవడం హైలైట్‌గా మారింది. 16వ BRICS సమ్మిట్‌లో భాగంగా మోదీ పుతిన్ కలుసుకున్నారు. ఇలా మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు పక్కనే ఒక ట్రాన్స్‌లేటర్ ఉంటారు. పుతిన్ మాట్లాడేది ఆయన ట్రాన్స్‌లేట్ చేస్తుండగా.. పుతిన్ మనది ట్రాన్స్‌లేటర్ కూడా అవసరం లేని స్నేహం అని పుతిన్ సరదాగా అన్నారు. డిఫెన్స్, అంతరిక్షం, ఎనర్జీ అంశాల్లో భారత్, రష్యా జాన్ జిగ్రీ దోస్తులు. ఈ మూడు అంశాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మోదీ పుతిన్‌తో ఓ మాట అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు నేను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం అని హామీ ఇచ్చారు.