Putha Siva Sankar Reddy: అమ్మాయిల బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టింది పవన్ కళ్యాణ్ అభిమాని
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. దొరికిందే ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై లేని పోని నిందలు వేస్తున్నారు. ఆడపిల్లల బాత్రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టిన విద్యార్థి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని.. అందుకే ఆ అబ్బాయి గురించి ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం అసలు పట్టించుకోలేదని అన్నారు. నిందితుడి ఇన్‌స్టాగ్రామ్ తీసి చూస్తే అన్నీ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటోలే ఉన్నాయని.. ఈ విషయం బయటికి వస్తే పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయలేరేమో.. ఆ ఫీజుల నుంచి దోచుకోలేమేమో అనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆ ఆడపిల్లలకు పవన్ న్యాయం చేయాలని కోరారు.