Purnesh Modi: రాహుల్‌పై కేసు వేసిన వ్యక్తికి BJP నుంచి పెద్ద ఆఫర్..!
Purnesh Modi: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై (rahul gandhi) కేసు పెట్టిన గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీకి BJP పెద్ద పోస్ట్ ఆఫర్ చేసింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్‌కు పూర్ణేశ్ మోదీని కేంద్రం రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించింది. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కర్ణాటకలో ప్రచారం చేస్తూ మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే అని అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేసారు. ఈ కేసులో భాగంగా రాహుల్‌కు సూరత్ న్యాయస్థానం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఓబీసీ వర్గానికి చెందిన పూర్ణేశ్ మోదీ మూడుసార్లు సూరత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నో శాఖలకు ఎంపీగానూ వ్యవహరించారు.