Purandeswari: చంద్రబాబే కరెక్ట్.. సుప్రీంకోర్టు తప్పు
Purandeswari: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లడ్డూలో వాడే నెయ్యి కల్తీదని.. అందులో జంతువుల నూనె వాడారని చెప్పడానికి ఆధారాలు ఏవని ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నేరుగా మీడియా ముందుకు వెళ్లి సాక్షాత్తు సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని గడ్డిపెట్టింది.
దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చారని ఆయన చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. సుప్రీంకోర్టు చంద్రబాబుని ప్రశ్నించడం సబబు కాదని చెప్పడం హాస్యాస్పదంగా మారింది.