Balkar singh: వీడియో కాల్‌లో మహిళతో మాట్లాడుతూ మంత్రి హస్త ప్రయోగం
Balkar Singh: ఉద్యోగం కోసం ఓ మహిళ మంత్రి సాయం కోరగా.. అతను వీడియో కాల్‌లో ఆమెతో లైంగిక చర్యలో పాల్గొన్నాడని వచ్చిన ఆరోపణలు పంజాబ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఆరోపణలను భారతీయ జనతా పార్టీకి చెందిన తజిందర్ పాల్ సింగ్ బగ్గా బయటపెట్టారు. పంజాబ్‌కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి బల్కీర్ సింగ్.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న మహిళతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ఆమెతో మాట్లాడుతూనే హస్త ప్రయోగం చేసుకున్నాడని తజిందర్ పాల్ వెల్లడించారు. దాంతో జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో ఈ ఘటనపై తమకు వివరణ కావాలని పంజాబ్ డీజీపీకి లేఖ రాసింది.