BTech Ravi Vs Jagan: “నిన్ను సునీతను చంపేస్తే దిక్కెవరు?”
BTech Ravi Vs Jagan: TDP పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవిని (btech ravi) కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసారు. తనిఖీల్లో భాగంగా రవి ప్రయాణిస్తున్న కారును ఆపిన పులివెందుల సీఐ అశోక్ రెడ్డి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా మూడు గంటల పాటు తప్పి కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
ఎందుకు పులివెందుల నుంచి పోటీ చేస్తున్నావంటూ జైల్లో పలు ప్రశ్నలు గుప్పించి ఆయన నుంచి ఫోన్ లాక్కున్నట్లు BJP నేత సీఎం రమేష్ (cm ramesh) మీడియా ద్వారా వెల్లడించారు. రవి అరెస్ట్ అయ్యాడని తెలీడంతో వెంటనే అతనితో జైల్లో ములాఖాత్ అయ్యారు రమేష్. ఆ సమయంలో బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. అసలు నువ్వు బతికుంటే కదా పులివెందులలో పోటీ చేసేది? నిన్ను వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను చంపేస్తే దిక్కెవరు అని బెదిరించినట్లు రవి సీఎం రమేష్‌తో చెప్పారు. దీనిపై కేంద్రమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చేస్తానని ఈ సందర్భంగా సీఎం రమేష్ తెలిపారు.
ఎన్నికలు దగ్గరపడుతుండడం అందులోనూ చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో సీఎం జగన్‌కు గెలుస్తామా లేదా అన్న టెన్షన్ మొదలైందని అందుకే ఇలా అరాచకంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని TDP నేతలు ఆరోపిస్తున్నారు.