EXCLUSIVE: నా దేవుడిని అసెంబ్లీలో చూడాలి.. అదే నా కోరిక‌

EXCLUSIVE: తాను టికెట్ ఆశించి జ‌న‌సేన పార్టీలో (janasena) చేర‌లేద‌ని అన్నారు 30 ఇయ‌ర్స్ పృథ్వీ (prudhvi raj). త‌న దేవుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగుపెడితే చూడాల‌నే త‌న కోరిక అని అంటున్నారు. రానున్న ఏపీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం త‌థ్యం అని తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాగానే తాను బ్రో సినిమాలో వేసిన శ్యాంబాబు గెట‌ప్‌తో ఊరూరా తిరిగి ప్ర‌చారం చేస్తాన‌ని పేర్కొన్నారు.