Prudhvi Raj: తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఉండదని.. 2024 జరిగే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగు దేశం పార్టీ, జనసేననే వస్తాయని అంటున్నారు సినీ నటుడు పృథ్వీ రాజ్. వై నాట్ 175 అని డప్పు కొట్టుకుంటున్న YSRCP ఇప్పుడెందుకు దాదాపు 90 మందిని మార్చేస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత అంబటి రాంబాబు జబర్దస్త్‌లోకి వెళ్తాడని ఏపీకి పట్టిన దరిద్రం పోవడానికి ఇంకా మూడు నెలలే సమయం ఉందని తెలిపారు. జనసేన పార్టీ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా రెడీగానే ఉన్నానని పేర్కొన్నారు.