Priyanka Gandhi: టి.కాంగ్రెస్‌ బాధ్యతలు ఆమెకేనా?

Hyderabad: కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంతో.. తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ఇప్పటి వరకు BRS పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా BJP ఉంటుందని అందరూ భావించారు. కానీ కర్నాటక ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. BRSకు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌(congress) రేసులోకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ నుంచి వీడిన వారు.. బీజేపీలో అసంతృప్తితో ఉన్నవారు.. కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. తల్లిలాంటి కాంగ్రెస్‌కు దూరం కావద్దని కోరారు. తనతో ఏవైనా విభేదాలు ఉంటే.. అధిష్టానంతో మాట్లాడవచ్చని సూచించారు. నాయకులు ఈటెల రాజేందర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి, తదితరులను పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి(priyanka gandhi) ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె తెలంగాణకు వచ్చి సందర్బంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా… ప్రజలు, కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంక గాంధీ మంచి వక్తగా కూడా ఆకట్టుకుంది. దీంతోపాటు.. టి.కాంగ్రెస్‌లో PCC చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా మందికి పడట్లేదు. ఇక ప్రియాంకగాంధీ వస్తే.. అన్నీ సర్దుకుపోతాయనే అభిప్రాయం ఉంది. నేతలంతా హైకమాండ్ పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారు కాబట్టి… ప్రియాంక అందర్నీ ఒకే తాటిపై నడిపించగలరని భావిస్తున్నారు. అదే జరిగితే.. ప్రజల్లో ఆ పార్టీ పట్ల సదభిప్రాయం కలుగుతుందని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. అయిదు నెలలే ఎన్నికలకు సమయం ఉండటంతో.. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.