Priyanka Gandhi: అహంకారం ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీలో చోటులేదు
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అనేది బాధ్యత గల నేతలు కలిగిన పార్టీ అని అన్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రియాంక జహీరాబాద్‌లో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రతీ కార్యకర్త పార్టీ అని.. అహంకారం ఉన్నవారే పార్టీని వీడతారని టికెట్లు రాక రాజీనామాలు చేసినవారిపై పరోక్షంగా మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో పేద ప్రజల బతులు బాగుపడతాయని అన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులలో BRS పార్టీ వేల కోట్లలో అవినీతి చేసిందని ధరణి పోర్టల్ పేరిట పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసారని.. అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తుచేసారు. కాంగ్రెస్ రావాలి.. KCRకు బై బై చెప్పాలని ప్రజల చేత నినాదాలు చేయించారు.