వారి నాటు నాటు డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయండి కానీ ఓట్లు వేయ‌కండి

Priyanka Gandhi: BJP, BRS, AIMIM పార్టీలు ఎన్నిక‌ల ముందు ఆడుతున్న నాటు నాటు డ్యాన్స్ ఎంజాయ్ చేయండి కానీ వారికి ఓట్లు మాత్రం వేయకండి అని సెటైర్ వేసారు ప్రియాంక గాంధీ. ఇంకా తెలంగాణ ఎన్నిక‌ల‌కు రెండు వారాలు ఉంద‌న‌గా తెలంగాణ‌లో విస్తృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

BRS, BJP ఎప్పుడూ ఒక‌రికొక‌రు తోడుగా ఉంటాయ‌ని.. వీరికి ఇప్పుడు పెద్ద‌న్నగా AIMIM కూడా చేరింద‌ని ఎగ‌తాళి చేసారు. తెలంగాణ‌లో BRS అధికారంలోకి రావాల‌ని AIMIM కేవ‌లం తొమ్మిది సీట్ల‌లోనే పోటీ చేస్తోంద‌ని ఇదే పార్టీ ఇత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు BJPని గెలిపించేందుకు కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా 40 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని విమ‌ర్శించారు. BJPకి ఓటు వేస్తే BRSకి లాభం.. BRSకి ఓటు వేస్తే BJPకి లాభం త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మంచి మాత్రం జ‌ర‌గ‌ద‌ని పిలుపునిచ్చారు.