Modi: పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే అధికారం ప్రధానికి లేదా?!
Delhi: భారత నూతన పార్లమెంట్(parliament) భవన నిర్మాణం పూర్తయ్యింది. ఈ నెల 28న ఆ భవనాన్ని ప్రధాని మోదీ(modi) ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈ తరుణంలో ప్రతిపక్షాలు.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించే అధికారం పీఎంకు ఉందడని.. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి ఉంటుందని విపక్ష నేతలు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. పార్లమెంట్ అనేది లెజిస్లేచర్ బాడీ కనుక దీన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని రాహుల్ గాంధీ, ఎంఐఎం నేతలు తదితరులు కోరుతున్నారు.
పార్లమెంట్ చట్టాలను చేసే రూపొందించే ప్రాంతం దీంతో దీన్ని లెజిస్లేచర్ బాడీ అని అంటారు. అందులో ప్రధాని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉంటారు. వాస్తవానికి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌లను వేరుచేసి చూడలేం. ఇంకో మాటలో చెప్పాలంటే.. ఎగ్జిక్యూటివ్‌కు లెజిస్లేచర్ బాధ్యత వహించాలి. అంతేకాకుండా.. పార్లమెంట్‌లో ప్రధాని పాత్ర కీలకం. ఈ విషయాన్ని రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తోంది. రాజ్యాంగం పరంగా ప్రధానిని వేరుచేయలేం. మరోవైపు రాష్ట్రపతి ఉన్నప్పటికీ.. ప్రధాని నాయకత్వంలో దేశం నడుస్తుంది. ఇక పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి వ్యూహకర్త మోదీనే. ఈ నేపథ్యంలో ప్రధాని పార్లమెంట్ భవనం ప్రారంభించవద్దు అని చెప్పడం.. ప్రతిపక్షాలు చేస్తున్న అర్థంలేని వ్యాఖ్యలని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే అధికారం మోదీ లేదని పొలిటికల్ మైలేజ్ కోసమేనని ఆరోపిస్తున్నారు.