Prathipati Pullarao: నన్ను.. నా కుటుంబాన్ని అడ్డుకోలేవ్ జగన్..!
Prathipati Pullarao: తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టుల తనను తన కుటుంబాన్ని అడ్డుకునే శక్తి జగన్ మోహన్ రెడ్డికి లేదని అన్నారు తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలో గెలవబోతున్నాననే జగన్ తన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆరోపించారు. తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే నా కుమారుడు శరత్ ను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని, విధ్వంసం…విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. ముందు శరత్ చేసిన తప్పేమిటో చెప్పాలని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, TDP నేతలు వేమూరి ఆనంద్ సూర్య, అంగర రామ్మోహన్ రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే మీకోసం…!
“”” చిలకలూరిపేట నియోజకవర్గంలో 5 సార్లు పోటీచేస్తే, 3 సార్లు మంచి మెజారిటీతో గెలిచాను. చంద్రబాబు అండతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. ప్రజల్లో ఉండే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే జగన్ రెడ్డి ఇలాంటి నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. చంద్రబాబు నాకు టిక్కెట్ ప్రకటించిన 24 గంటల్లోనే నా కుమారుడు సహా…కుటుంబ సభ్యులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం (DRI) ఎవరి అధీనంలో పనిచేస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం.
చిలకలూరిపేటలో విజయం ఒకవైపు ఉండటాన్ని గమనించే DRI వ్యవస్థద్వారా నా కుమారుడు… మా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారు. ప్రతిపక్ష సభ్యులపై బురదజల్లడమే ధ్యేయంగా జగన్ రెడ్డి DRI విభాగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. గిట్టనివారు.. ప్రతిపక్ష సభ్యులపై తప్పుడు కేసులు పెట్టించి, వారిని లొంగదీసుకోవాలన్న జగన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా DRI పనిచేస్తోంది. నాకు సీటు ప్రకటించిన 24 గంటల్లో కేసు పెట్టడం… నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చేశారు. అర్థరాత్రి ఎక్కడెక్కడో తిప్పి, ఎప్పుడో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో .. దానిపై ప్రజలు చర్చించుకోకూ డదని నాకుమారుడి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారు. రేపు గురజాల రా…కదలిరా సభ విజయవంతం కావడంతో మరో నాయకుడిని టార్గెట్ చేస్తారు.
తాడేపల్లి గూడెం సభ విజయవంతం కావడంతో దానిగురించి ప్రజలు చర్చించుకో కూడదన్న దురుద్దేశంతోనే జగన్ రెడ్డి DRIని రంగంలోకి దింపి, నా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఇలాంటి పనులు జగన్ రెడ్డికి బాగా అలవాటే కదా! త్వరలో గురజాలలో రా…కదలిరా సభ ఉంది.. అది కూడా భారీస్థాయిలో విజయవంతం కావడం ఖాయం. ఆ సభ తర్వాత మరో టీడీపీ నాయకుడిని టార్గెట్ చేస్తారు. ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకోసం జగన్ DRIని వాడుకుంటున్నాడు. తెలుగుదే శం పార్టీలో బలమైన నాయకుల్ని దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, జగన్ రెడ్డికి మరేమీ పట్టడం లేదు. ఎదుటివారిపై పెట్టే తప్పుడుకేసులతో తనకు నష్టం జరు గుతుందని తెలిసినా జగన్ రెడ్డి ఆగడు.
సొంత చెల్లినే వదలని వాడు..ప్రతిపక్షనేతల్ని వదిలేస్తాడా?
తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతురినే వేధిస్తున్న వ్యక్తి సామాన్యుల్ని.. ప్రతిపక్ష నేతల్ని వదిలేస్తాడా? పోలీసులు నా కుమారుడును 16 గంటలపాటు 6 స్లేషన్లు తిప్పారు. ఎక్కడ ఎవరిని అడిగినా మాకుతెలియదు.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలనే చెప్పారు అని పుల్లారావు తెలిపారు.
పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే జగన్ ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుడుతున్నాడు
“””” పుల్లారావు కుమారుడు శరత్.. ఆయన కుటుంబసభ్యులపై DRI విభాగంతో అక్రమ కేసులు పెట్టించి, రాత్రి ఎప్పటికో మాచవరం పోలీస్ స్టేషన్లో సెక్షన్ 409, 461, 420లు నమోదు చేయించి, న్యాయమూర్తితో శరత్ కు రిమాండ్ వేయిం చారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. తెలుగువరంతా ఈ ప్రభుత్వ తీరుని, ముఖ్యమంత్రి కక్షసాధింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు… తన ప్రభుత్వా నికి ప్రజల్లో ఎదురుగాలి వీస్తోందనే జగన్ రెడ్డి ఇలాంటి చర్యలకు సిద్ధమయ్యాడు. తాడేపల్లిగూడెం సభ విజయవంతంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న తరుణం లో జగన్ రెడ్డి ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెరతీశాడు. జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయం.
తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సూట్ కేసు కంపెనీలు పెట్టి, లక్షలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి.. తనలాగే యువపారిశ్రామికవేత్తలు కూడా తప్పుడు మార్గంలో సంపా దిస్తారని జగన్ అనుకుంటున్నాడు. మొన్నటివరకు సీఐడీని జేబు సంస్థగా మార్చిన జగన్ రెడ్డి…ఇప్పుడు DRI తో తన కుట్రలు అమలుచేస్తున్నాడు. శరత్ కు న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుంది. జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా ప్రజల్ని చైతన్యం చేసి… టీడీపీ-జనసేన కూటమి విజయకేతనం ఎగరే యడం ఖాయం. చిలకలూరిపేటలో పుల్లారావు గెలుపు ఆపడం ముఖ్యమంత్రి తరం కాదు “””” అని రవీంద్ర తేల్చిచెప్పారు.