Prakash Raj: పవన్ BJPతో ఉన్నారు.. నేను ఆయనకు ఓటెయ్యను
Prakash Raj: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై (revanth reddy) విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అనడం కంటే BJP ఓడిపోయింది అనడం బెటర్ అని అన్నారు. అలాగని తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అనలేమని తెలిపారు. ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించే నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు ప్రజల ముందు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దానిని మెడల్‌గా భావిస్తానని అంటున్నారని అలాంటి స్కామ్స్ గురించి మాట్లాడటానికి అతనికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.
పవన్‌కి సపోర్ట్ చేయను
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించి కూడా మాట్లాడారు ప్రకాశ్ రాజ్. సినిమాల్లో తామిద్దరం కొలీగ్స్ అని పవన్ ఓటు షేర్‌ని పట్టించుకోకుండా ఒంటరిగా దిగితే బాగుంటుందని అది వదిలేసి మత రాజకీయాలకు పాల్పడే BJPతో నిలబడటం తనకు నచ్చలేదని అన్నారు. ఒకవేళ తెలంగాణలో ఓటు వేసే అవకాశం తనకు వస్తే కచ్చితంగా BRSకే వేస్తానని KCR మళ్లీ సీఎం అయితే బాగుంటుందని పేర్కొన్నారు. KCRలో ఒక సీఎం మాత్రమే కాదు ప్రధాన మంత్రి అయ్యే సత్తా కూడా ఉందని తెలిపారు.