Prakash Raj: ఆ ఈవెంట్‌కు అస్సలు వెళ్లకండి సర్..!
Bengaluru: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (siddaramaiah) వివాదంలో ఇరుక్కున్నారు. మత విద్వేష అభిప్రాయాలు ఉన్న విశ్వేశ్వర్ భట్ (vishweshwar bhat) అనే కన్నడ రైట్ వింగ్ ఎడిటర్ రాసిన పుస్తక ప్రారంభ కార్యక్రమానికి సిద్ధారామయ్య హాజరుకానున్నారు. దాంతో నటుడు ప్రకాష్ రాజ్‌తో (prakash raj) పాటు ఇతర నెటిజన్లు సిద్ధారామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ చనిపోయినప్పుడు ఆమె గురించి అసభ్యకరంగా రాసిన వ్యక్తి నుంచి పిలుపు వస్తే నో చెప్పకుండా ఎలా వెళ్తారు సర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మంచిపోయింది ఏమీ లేదని, వెంటనే పుస్తక ప్రారంభ కార్యక్రమానికి రాను అని తెగేసి చెప్పేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు.
విశ్వేశ్వర్ భట్ విశ్వవాణి (vishwavani) అనే కన్నడ దినపత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతను సంపదకారా సత్యశోధనే (sapadakara sathyashodane) అనే పుస్తకం రాసారు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి విశ్వేశ్వర్ భట్.. సిద్ధారామయ్యతో పాటు ఇతర ప్రముఖులను కూడా గెస్ట్‌లుగా పిలిచారు. ఈ కార్యక్రమానికి సిద్ధారామయ్య వెళ్లనున్నారు అని తెలీడంతో ప్రకాష్ రాజ్ షాకయ్యారు. దివంగత జర్నలిస్ట్ గౌరీ లంకేష్ సోదరి కవిత లంకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ విశ్వేశ్వర్ భట్ గతంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) గురించి ఓ ఎడిటోరియల్ రాసారని అందులో మంచ ఎగనెస్ట్ BJP అని దరిద్రమైన హెడింగ్ పెట్టారని సిద్ధారామయ్యకు (siddaramaiah) గుర్తు చేసారు. మంచ అంటే మంచం అనే అర్థంతో పాటు ఫోరం అనే అర్థం కూడా వస్తుంది. కానీ విశ్వేశ్వర్ కచ్చితంగా దురుద్దేశంతోనే మంచ అనే పదాన్ని వాడారని కవిత లంకేష్ ఆరోపించారు. తన అక్కను చంపేసినప్పుడు కూడా గుండు (బుల్లెట్)తో కాకుండా గుండు (మద్యం) వల్ల గౌరీ లంకేష్ చనిపోయి ఉంటే వార్తల్లోకి ఎక్కేవారు కాదేమో అంటూ అసభ్యకరంగా రాసారని ఈ సందర్భంగా సిద్ధారామయ్యకు గుర్తుచేసారు. మరి ఇంత రచ్చ అవుతున్నా సిద్ధారామయ్య ఆ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ పడుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.