EXCLUSIVE: జ‌న‌సేన‌లోకి ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌?

EXCLUSIVE: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) పెద్ద‌మ్మ‌, దివంగ‌త న‌టుడు కృష్ణంరాజు (krishnam raju) భార్య శ్యామలా దేవి (shyamala devi) జ‌న‌సేన‌లో (janasena) చేర‌నున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. శ్యామ‌ల జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేస్తే త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేసి గెలిపిస్తామ‌ని న‌టుడు, జ‌న‌సేన నేత పృథ్వీరాజ్ కూడా తెలిపారు. న‌ర‌సాపురం నుంచి ఎంపీ స్థానానికి ఆమె పోటీలో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రోప‌క్క శ్యామ‌ల‌ YSRCP నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో ర‌ఘురామ కృష్ణంరాజు YSRCP పార్టీలో చేరి న‌ర‌సాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న అస‌మ్మ‌తి నేత‌గా మారారు. ఆ త‌ర్వాత నుంచి తెలుగు దేశం పార్టీకే (TDP) స‌పోర్ట్ చేస్తున్నారు.

అయితే 2024 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం నుంచి కానీ జ‌న‌సేన నుంచి కానీ ర‌ఘురామ కృష్ణంరాజు న‌ర‌సాపురం సీటు నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌ను ఢీకొనేందుకు గ‌ట్టి అభ్య‌ర్ధిని న‌ర‌సాపురం నుంచి నిల‌బెట్టాల‌ని జ‌గన్ అనుకుంటున్నార‌ట‌. ఇందుకు శ్యామలా దేవి అయితే క‌రెక్ట్ అని జ‌గ‌న్ భావించిన‌ట్లు తెలుస్తోంది. న‌టుడు కృష్ణంరాజు చ‌నిపోయారు కాబ‌ట్టి ఆ సానుభూతితో శ్యామ‌లా దేవికి ఓట్లు ప‌డ‌తాయ‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ట‌. ఇదే విష‌యం గురించి YSRCP నేత‌లు శ్యామ‌లా దేవి వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా ఆమె ఆలోచించి చెప్తాన‌ని అన్నార‌ట‌.