Poonam Kaur: విజ‌య‌సాయి రెడ్డికి పూన‌మ్ కౌర్ మ‌ద్ద‌తు

poonam kaur comes in support of vijaya sai reddy

Poonam Kaur: ఓ వివాహిత‌ను గ‌ర్భిణిని చేసాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విజ‌య సాయిరెడ్డిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు న‌టి పూన‌మ్ కౌర్. త‌న మ‌ద్ద‌తు విజ‌య సాయిరెడ్డికే అని తెలిపారు. “” విజ‌య‌సాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్య‌వ‌స్థ‌ల్లా త‌యార‌య్యాయి. గిరిజ‌న మ‌హిళ అయిన శాంతికుమారి త‌ర‌ఫున నిల‌బ‌డిన విజ‌య‌సాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. బుద్ధిలేని టీవీ ఛానెళ్లు ఆమె గ‌ర్భం దాల్చింద‌ని తెలీగానే ఎవ‌రి దగ్గ‌రో డ‌బ్బు తీసుకుంద‌ని.. సేమ్ క‌థ‌ను రిపీట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒక్క‌టే చెప్పాల‌నుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపు అవుతుంది. ఇలాంటి ఎద‌వ‌ల కోసం నీ క‌న్నీరును వృథా చేసుకోకు. నీకు న్యాయం జ‌రిగేలా చూసేందుకు నీ భ‌ర్త నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు “” అని పేర్కొన్నారు.