Ponnala Lakshmaiah: కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్
Telangana Elections: కాంగ్రెస్ పార్టీని వీడి BRSలో చేరిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు (ponnala lakshmaiah) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) నుంచి కాల్ చేసారు. ఎన్నికల సమయంలో సీనియర్ అయిన ఆయన ప్రత్యర్ధి పార్టీలోకి వెళ్లిపోవడంపై రాహుల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పొన్నాలకు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి కలవాలని కోరారట. మరి ఆల్రెడీ BRSలో చేరిన పొన్నాల ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుని కాంగ్రెస్లో చేరతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ పొన్నాల మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు.