Ponguleti: లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎంగా పొంగులేటి?
Ponguleti Srinivas Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ బాధ్యతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయనే నెంబర్ 2 అనే టాక్ ఉంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో కూడా అంటున్నారట. ఈ వార్తలపై పొంగులేటి చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడారు.
“” నేను రేవంత్ రెడ్డి పక్కన ఉంటే నెంబర్ 2 ఎలా అవుతాను. నేను సీనియర్‌ని కూడా కాను. అలాగని జూనియర్‌ని కూడా కాను.. సబ్ జూనియర్‌ను. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. నేను పండ్లున్న చెట్లును. హైకమాండ్ ఆదేశిస్తే నేను సీఎం అవుతాను కానీ నా అంతట నేను అనేసుకుంటే అయిపోను కదా “” అని అన్నారు. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పొంగులేటి తర్వాతి సీఎం అని ఎవ్వరూ ఎక్కడా అనింది లేదు. అలాంటి టాక్ కూడా వినిపించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు సీఎం అవ్వాలన్న ఆశతో ఉన్నారని అప్పుడప్పుడూ టాక్ వినిపించింది కానీ పొంగులేటి విషయంలో ఈ మాట ఎప్పుడూ రాలేదు. అలాంటిది ఆయనంతట ఆయనే నేను రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఎలా అవుతాను అంటూ మీడియా ముందు ప్రస్తావించారు. దాంతో ఆయన కావాలంటే ఈ చర్చకు ఆజ్యం పోసినట్లుగా అనిపిస్తోంది.