Ponguleti: KCR..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి

Telangana Elections: ఖ‌మ్మం నియోజ‌క‌వర్గాల్లో మాట్లాడేట‌ప్పుడు KCR నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు కాంగ్రెస్ నేత పొంగులేటి (ponguleti) శ్రీనివాస్ రెడ్డి. డ‌బ్బుంద‌న్న పొగ‌రుతో మాట్లాడుతున్నాను అంటున్నార‌ని.. అస‌లు 2014లో ఎవ‌రి వ‌ద్ద ఎంతుంది.. ఇప్పుడు ఎంతుంది అనే విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు. న‌వంబర్ 30 త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేన‌ని.. కాంగ్రెస్ పార్టీలో చేరేట‌ప్పుడే త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు దాడులు జ‌రుగ‌తాయని తెలుస‌ని తెలిపారు. అయినా తాను కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి కార‌ణం ప్ర‌జ‌లు, త‌న కార్య‌క‌ర్త‌లు కాంగ్రెసే అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నాయ‌ని పేర్కొన్నారు.

BRS పార్టీకి చెంచాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంత‌మంది పోలీస్ అధికారుల‌కు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక క‌చ్చితంగా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని.. పోలీస్ వ్య‌వ‌స్థ అనేది పార్టీల‌కు అతీతంగా ప‌నిచేయాలి కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి స‌లాం కొట్టి ఇత‌ర పార్టీ నేత‌ల‌పై దాడులు చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఖ‌మ్మంలో చాలా మంది BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్నార‌ని.. దీనిని బ‌ట్టి చూస్తే అధికారంలోకి రాబోయేది కాంగ్రెసే అని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అన్నారు. టికెట్లు రాని అభ్య‌ర్ధులు తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని మున్ముందు అంతా మంచే జ‌రుగుతుంద‌ని సూచించారు.