Ponguleti: KTR కాపాడ‌తార‌నుకున్నా కానీ..

Telangana Elections: BRS పార్టీలో అస‌మ్మ‌తికి గురై బ‌య‌టికి వ‌చ్చేసారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti). ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. రానున్న ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి పోటీ చేయాల‌నుకుంటున్నారు. అస‌లు BRS పార్టీ నుంచి ఎందుకు బ‌య‌టికి వ‌చ్చారు అని అడ‌గ్గా.. త‌న ఆవేద‌న‌ను బ‌య‌ట‌పెట్టారు.

2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్పుడు అసలు ఎందుకు ఓడిపోయాను అని కూడా క‌నీసం రివ్యూ మీటింగ్ వంటివి పెట్ట‌కుండా తాను ఎందుకు ప‌నికిరాను అని పార్టీ అధినేత, సీఎం KCR తీర్మానించేసార‌ని అది త‌న‌కు చాలా బాధ క‌లిగించింద‌ని అన్నారు. KCR కంటే KTRతో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని.. త‌న‌ను కేటీఆరే కాపాడ‌తార‌ని అనుకున్నాను కానీ అది జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. తండ్రిగా భావించిన కేసీఆరే క‌రెక్ట్‌గా లేన‌ప్పుడు ఇక పార్టీలోని ఇత‌ర నాయ‌కులు త‌న ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించారు అని మాట్లాడుకోవ‌డంలో అర్థంలేద‌ని పేర్కొన్నారు.

ఇక ఆ పార్టీలో ఉంటే బంగారు తెలంగాణ అనేది సాధ్యం కాద‌ని అర్థ‌మ‌య్యాకే కాంగ్రెస్‌లో చేరాన‌ని అన్నారు. ఖ‌మ్మంలో పోటీ చేస్తున్న BRS నాయ‌కుల‌ను అస‌లు అసెంబ్లీ గేట్ కూడా తాక‌నివ్వ‌న‌ని.. త‌న‌కు ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.