YS Sharmila: పోలీసుల‌కు హార‌తిచ్చిన ష‌ర్మిళ‌

గజ్వేల్ పర్యటనకు బయలుదేరిన షర్మిలను (ys sharmila) పోలీసులు అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని లోట‌స్ పాండ్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆమెను పోలీసులు అడ్డుకోవ‌డంతో వారికి హార‌తి ఇచ్చి నిర‌స‌న వ్య‌క్తం చేసారు. దాంతో పోలీసుల‌కు, ష‌ర్మిళ‌కు మ‌ధ్య వాగ్వాదం నెల‌కొంది. ఎక్క‌డ అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డిపోతాయోన‌న్న భ‌యంతోనే త‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని ష‌ర్మిళ అన్నారు. ష‌ర్మిళ‌ను పోలీసులు గృహ‌నిర్భందం చేసారు.