Uttarakhand: ఫోన్ మాట్లాడుతూ సీఎంకి సెల్యూట్..!
సీఎం వస్తున్నారంటే పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది ఓ పోలీసు సీఎం ముందే నిలబడి ఫోన్ చూసుకుంటూ మరీ సెల్యూట్ చేసాడు. దాంతో ఆయనకు ఒళ్లుమండి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో (uttarakhand) జరిగింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఆయన హెలికాప్టర్ దిగగానే అక్కడే ఉన్న ఓ పోలీసు ఫోన్ చూసుకుంటూ, కాల్ మాట్లాడుకుంటూ ఏమీ పట్టనట్లు ఓ సెల్యూట్ కొడితే అయిపోతుందిలే అన్నట్లు బిహేవ్ చేసాడు. అది చూసిన సీఎంకు మండింది. గంటలో బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్లు వచ్చాయి.