Narendra Modi: ఇండియా కాదు ఘ‌మండియా

Delhi: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో BJP (NDA)ను త‌రిమికొట్టేందుకు 26 పార్టీలు క‌లిసి ఓ కూట‌మిగా ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. సోనియా గాంధీ (sonia gandhi) నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ కూట‌మికి ఇండియా (I-N-D-I-A) అని పేరు పెట్టారు. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ.. అది ఇండియా కాదు ఘ‌మండియా అన్నారు. అంటే అహంకారంతో కూడుకున్న కూట‌మి అంటూ విమ‌ర్శించారు.

గ‌తంలో UPA పేరు పెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు గ‌తంలో చేసిన అరాచ‌కాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇండియా పేరు పెట్టుకుంద‌ని అన్నారు. దేశంపై భ‌క్తితో త‌మ కూట‌మికి ఇండియా అని పేరు పెట్టుకున్నట్లు న‌టిస్తున్నారు కానీ నిజానికి దేశాన్ని దోచుకోవ‌డానికే ఆ పేరు పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. (narendra modi)