Modi: అవును నేను పామునే కానీ..

Delhi: ఇటీవ‌ల కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే(mallikarjun kharge).. బీజేపీని(bjp) ప‌రోక్షంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ(modi)ని విష‌స‌ర్పంతో పోల్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. అయితే ఈరోజు 100వ మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో మోదీ.. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. “ఇటీవ‌ల న‌న్ను కొంద‌రు విష స‌ర్పంతో పోల్చారు. విష‌స‌ర్పం శివుడి మెడ‌లో ఆభ‌ర‌ణంలా ఉంటుంది. అవును నేను పామునే. ఈ దేశ ప్ర‌జ‌లు నాకు ప‌ర‌మ‌శివుడితో స‌మానం. అలా చూసుకుంటే దేశ‌ప్ర‌జ‌ల వెన్నంటే ఉండే స‌ర్పాన్నే నేను. దేశంలో అవినీతిని వేళ్ల నుంచి పీకిపారేస్తుంటే కాంగ్రెస్‌కు న‌చ్చ‌డం లేదు. వారికి స‌రైన గుణ‌పాఠం మే 13న చెప్తాను. కాంగ్రెస్ 85% క‌మిష‌న్ పార్టీ. అలాగ‌ని అప్ప‌ట్లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగే అన్నారు. కర్ణాట‌క‌లో గెలిచేసి రాష్ట్రాన్ని దోచేయాల‌ని అనుకుంటున్నారు. కానీ క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అలా జ‌ర‌గ‌నివ్వ‌రు. ఎందుకంటే వారికి డ‌బుల్ ఇంజిన్ ప‌వ‌ర్ తెలుసు. కోలార్ ప్ర‌జ‌లు కాంగ్రెస్, జేడీ(ఎస్) నేత‌ల‌కు నిద్ర‌లేని రాత్రుల‌ను ఇస్తున్నారు” అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.