AP Elections: అత్య‌ధిక ఓటు శాతం ఈ నియోజ‌క‌వ‌ర్గానిదే..!

pithapuram is the only constituency which got the highest voter turn out

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలింగ్ ప్ర‌క్రియ దాదాపు ముగింపుకు వ‌చ్చేసింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల పోలింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు లైన్లో వేచి ఉన్న‌వారి చేత పోలింగ్ బూత్ అధికారులు ఓట్లు వేయిస్తున్నారు. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక పోలింగ్ శాతం న‌మోదైంది ఏ నియోజ‌క‌వ‌ర్గమో తెలుసా? పిఠాపురం.

ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు పిఠాపురంలో న‌మోదైన ఓటు శాతం 71.58%. మొత్తం రాష్ట్ర ఓటు శాతం కంటే ఇది ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. 2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి ఓటు శాతం బాగానే పెరిగింది. పిఠాపురం నుంచి జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వంగా గీత పోటీ చేసారు. మ‌రోప‌క్క ఓటింగ్ ప్ర‌క్రియ కార్య‌క్ర‌మాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్న తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ 95% గెలుపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌దే అని అంటున్నారు. అస‌లు వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పోలింగ్ బూత్‌ల వ‌ద్ద‌కు రాలేద‌ని.. ప‌వ‌న్‌కే ఓటేసామ‌ని చాలా మంది ఓటర్లు స్వ‌యంగా త‌న‌తో చెప్పార‌ని వ‌ర్మ తెలిపారు.