Pinnelli Ramakrishna Reddy: నాడు.. టచ్ చేయమను చూస్తా.. నేడు.. సైలెంట్‌గా అరెస్ట్
Pinnelli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఏపీ హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దాంతో పోలీసులు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి సర్ అని మీడియా వారు ప్రశ్నించగా.. టచ్ చేయమను చూస్తా.. అని పొగరుగా మాట్లాడిన పిన్నెళ్లి.. ఈరోజు అధికారం పోవడంతో సైలెంట్‌గా పోలీసులకు లొంగిపోవాల్సిన పరిస్థితి. దాంతో అధికారం అండతో విర్రవీగితే అంతే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.