Perni Nani: మేం తిరగబడే దాకా తెచ్చుకోవద్దు
Perni Nani: ఇంకా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని.. ఇలా చేసి ఏపీని మరో బిహార్‌గా మార్చొద్దని అన్నారు. ఇలాగే దాడులకు తెగబడితే తాము తిరబడాల్సి వస్తుందని.. అంతదాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. బోనులో పెడితే పిల్లి కూడా పులవుతుందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు.