Perni Nani: మా పార్టీ.. మా ప్రయోగాలు.. మా ఇష్టం
Perni Nani: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (ap elections) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy)తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయ్. జగన్ అభ్యర్ధులను మారుస్తున్నారని.. ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్తవారికే టికెట్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై TDP నేతలు జగన్ భయపడుతున్నారు అందుకే అభ్యర్ధులను మార్చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై YSRCP నేత పేర్ని నాని మండిపడ్డారు. మా పార్టీ.. మా ప్రయోగాలు.. మా ఇష్టం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇవి ఇప్పటి నుంచి జరుగుతున్న మార్పులు కావని.. ఏడాది నుంచే జగన్ సీట్ల ఎంపిక అభ్యర్ధుల మార్పుపై చర్చలు జరుపుతున్నారని స్పష్టం చేసారు. మార్పులు చేస్తుంటే విపక్షాలు ఎందుకు ఉలిక్కిపడుతుంటాయి అని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో మార్పులకు సంబంధం లేదని.. ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకపోతే ఎవరో ఒకరో ఇద్దరు అభ్యర్ధులు ఇతర పార్టీల్లో చేరడం లేదా జగన్‌ను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే భయపడి జగన్‌ను కలుస్తున్నారని అనుకుంటే పొరపాటే అని తెలిపారు. పార్టీలో రాజకీయ అవసరాలు ఉన్న నేతలు చాలా తక్కువగా ఉన్నారని అందరికీ జగనే ముఖ్యమని అనుకుంటున్నారని పేర్కొన్నారు.