Perni Nani: హ‌రీష్ రావు KCRని వెన్నుపోటు పొడ‌వ‌డం ఖాయం

YSRCP నేత పేర్ని నాని (perni nani) BRS మంత్రి హ‌రీష్ రావుపై (harish rao) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ గురించి స్పందిస్తూ.. ఆయ‌న్ను ఈ వ‌య‌సులో అరెస్ట్ చేయ‌డం మంచిది కాద‌ని.. ఆయ‌న అరెస్ట్ అవ్వ‌డం దురదృష్ట‌క‌రం అని అన్నారు. దీనిపై పేర్ని నాని స్పందిస్తూ.. “” హ‌రీష్ రావు ఎవ‌రు.. KCRకి అల్లుడు. చంద్ర‌బాబు ఎవ‌రు.. దివంగ‌త నేత NTRకి అల్లుడు. ఈ అల్లుళ్లు మామ‌ల‌ను వెన్నుపోటు పొడిచేవారే. రేపు హ‌రీష్ రావు KCRని వెన్నుపోటు పొడ‌వడం ఖాయం. కాక‌పోతే NTR అమాయ‌కుడు కాబ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు మోసాన్ని ఆప‌లేక‌పోయారు. కానీ KCR గ‌ట్టి మ‌నిషి కాబ‌ట్టి హ‌రీష్ రావుపై ఓ క‌న్నేసి ఉంచుతారు “” అని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. (perni nani)