Perni Nani: రామోజీ పోయాడనుకుంటే కొడుకు తగులుకున్నాడు
Perni Nani: ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీ రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈనాడు పత్రికలో తమ పార్టీకి వ్యతిరేకంగా రాసిన ఓ వార్తను చూపిస్తూ.. రామోజీ పోయాడనుకుంటే ఆయన కుమారుడు బతికే ఉన్నాడేమో అందుకే ఇంకా తమపై విషం చిమ్ముతున్నారు అని వ్యాఖ్యానించారు.
జగన్ మోహన్ రెడ్డి తనకు రక్షణగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నారని.. ఇంట్లో ఉన్నప్పుడే 986 మంది భద్రతా బలగాలు ఉంటారని.. ఇక బయటికి వెళ్తే అంతకంటే రెట్టింపు సిబ్బంది ఉంటారని ఆ పత్రికలో రాసారు. కేవలం భద్రతా సిబ్బంది కోసమే దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని ఈనాడు పత్రికలో రాసారు.
దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ.. “” ఇంతగా ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థంకావడంలేదు. సహజంగానే ముఖ్యమంత్రి బయటికి వెళ్తే సివిల్ సర్వీసెస్‌కి సంబంధించిన సిబ్బందితో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్సెస్, ఆక్టోపస్ బెటాలియన్ సెక్యూరిటీ ఇస్తారు. జగన్ ఇంటి చుట్టూ 23 మంది సిబ్బంది ఉంటారు. ఆయన కాన్వాయ్‌కి 21 మంది భద్రత ఉంటారు. మొత్తం 196 మంది సీఎం వెనుక ఉంటారు. బెంగళూరులో జగన్ ఇంటి దగ్గర ఎలాంటి భద్రతా సిబ్బంది ఉండరు. ప్రభుత్వం మీదే కాబట్టి కావాలంటే మీరే వెళ్లి చెక్ చేసుకోండి. మరి 986 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వారేమన్నా సీఎం బంధువులా? ఈ రామోజీరావు కుమారుడు ఇంత దారుణంగా రాస్తారా?
ఇక హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చేసారు అంటున్నారు. అసలు దానికి జగన్‌కి ఏం సంబంధం? జగన్‌కి భద్రత కల్పించేందుకు వచ్చే పోలీసులు 24 గంటలు డ్యూటీలో ఉండరు. ప్రతి మూడు గంటలకు వారి షిఫ్ట్ మారుతుంది. ఆ సమయంలో వారు విశ్రాంతి తీసుకునేందుకు తాత్కాలికంగా రేకుల షెడ్లు కట్టించారే తప్ప వాటికి జగన్ ఇంటికి సంబంధం లేదు. ఈ రేకుల షెడ్లు ఒకప్పుడు ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా.. రోశయ్య నివాసం ఎదురుగా.. ఇప్పుడు చంద్రబాబు నివాసం ఎదురుగా కూడా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు కూల్చలేదు? ఎవరో తెలంగాణలో రెడ్డిగారికి నచ్చక జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చేసారు. మొన్న చంద్రబాబు నాయుడు నా కోసం ట్రాఫిక్‌ని ఆపద్దు అని ఆదేశించారట. అసలు ఆయన వెళ్లే రూట్‌లో ఎక్కడా కూడా ఆయన కాన్వాయ్ సిగ్నల్ వద్ద ఆగదు. ఆయన వెళ్లే రూట్లో ఇతర వాహనాలే వెళ్లవు. ఇక ట్రాఫిక్ ఆపడానికి ఏముంది? “” అని వెల్లడించారు.