Telangana: రేషన్ కార్డులు రద్దు.. ఆందోళనలో ప్రజలు
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రజా పాలన పేరిట ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు దరఖాస్తు పత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాగా.. మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఘట్ కేసర్ – 2,273
కాప్రా – 2,263
కీసర – 3388
మేడ్చల్ – 2,306
మేడిపల్లి – 4,165
శామీర్పేట – 893
మూడుచింతలపల్లి – 3,208 రేషన్ కార్డులు రద్దయ్యాయి.
ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి. మిగతా జిల్లాల్లో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.