Payyavula Keshav: చంద్ర‌బాబుని చూసి మాకు ధైర్యం వ‌చ్చింది

జైల్లో ఉన్న చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) చూసిన త‌ర్వాత ఆయ‌న ధైర్యం చూసి త‌మ‌కు కాస్త ధైర్యం క‌లిగింద‌ని అన్నారు TDP నేత పయ్యావుల కేశ‌వ్ (payyavula keshav). ఈ రోజు కేశ‌వ్ చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయ్యారు. త‌న‌ను చూడ‌గానే కృష్ణా జ‌లాల స‌మ‌స్య గురించి అడిగి తెలుసుకున్న‌ట్లు తెలిపారు. అక్ర‌మ కేసులో జైల్లో పెట్టించిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి జైల్లో మ‌రింత దృఢంగా మారార‌ని.. జైల్లో కూడా ఏపీ రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబు జైల్లో ఉన్నా ఒక‌టే బ‌య‌ట ఉన్న ఒక‌టే అని ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌డంపై కేశ‌వ్ స్పందిస్తూ.. ఆ విష‌యంలో జ‌గ‌న్ క‌రెక్ట్‌గా చెప్పార‌ని.. చంద్ర‌బాబు బ‌య‌ట ఉంటే ఎలా పోరాడ‌తారో జైల్లో కూడా అలాగే పోరాడుతున్నార‌ని అన్నారు.