Nara Lokesh: నాది కాలేజ్ లైఫ్.. జగన్‌ది జైల్ లైఫ్!
గుంటూరు జిల్లాలో నిర్వహించిన హలో లోకేష్ (hello lokesh) కార్యక్రమంలో TDP జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (nara lokesh) యువతతో సరదాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కొందరు లోకేష్ క్రష్‌ల గురించి ప్రేమ, పెళ్లి గురించి అడిగారు. వాటికి లోకేష్ సమాధానం చెప్తూ.. “” నాకు స్కూల్లో, కాలేజీలో చాలా క్రష్‌లు ఉన్నాయి. అప్పట్లో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ అనవసరంగా ట్రోల్ చేస్తారు. నాది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ “” అని సెటైర్ వేసారు.