Pawan Kalyan: 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే…!
జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) నాలుగో విడత విజయ వారాహి యాత్ర (varahi yatra) ప్రారంభం అయింది. ఉభయ గోదావరి ప్రాంతం అయిన అవనిగడ్డలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. YSRCP ఓడిపోవడం ఖాయం.. మేం గెలవడం డబుల్ ఖాయం, మెగా DSC ఉద్యోగాలు ట్రిపుల్ ఖాయం అని అన్నారు.
“” జగన్ పాదయాత్ర చేస్తూ ఇవ్వని వరం అంటూ లేదు. కానీ నిలబెట్టుకోలేదు. నేను పదేళ్ల నుంచి జనసేనను నడుపుతున్నాను. ప్రజల కోసం జగన్‌తో పోటీ పడుతున్నాను. పోలీస్ శాఖను భయపెట్టి మరీ మనపై ఉసిగొల్పుతుంటారు. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి పోలీస్ సమస్యలు నాకు తెలుసు. ప్రభుత్వ జీతాలతోనే కడుపు నింపుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. నా రాష్ట్రం నా ప్రజల కోసం జనసేన పెట్టా. ఎన్నో దెబ్బలు తిన్నా. ఓటమి ఒంటరితనాన్ని ఇస్తుంది. ఆశయాలు నడిపేవారికి, విలువల కోసం నడిపేవారికి ఇంకా నరకంగా ఉంటుంది. అధికారం కోసం అర్రులు చాచను నేను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను. (pawan kalyan)
అనుక్షణం యుద్ధ రంగం నుంచి పారిపోవాలని బెదింపులకు పాల్పడుతున్నారు. జనానికి నాపై నమ్మకం లేదు అని అంటున్నారు. 2014, 2019 తర్వాత ఇప్పుడు మూడో ఎన్నిక జరగబోతోంది. ఈరోజు మాటిస్తున్నాను.. 2014లో జనసేన పెట్టి TDPకి, BJPకి మద్దతు ఇచ్చినప్పుడు.. రేపు అనుకున్న హామీలు నెరవేర్చకపోతే ఏ పార్టీ తరఫున నిలబడను అని చెప్పాను. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. ప్రత్యేక హోదా కోసం కాకుండా స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటున్నారని TDPతో విభేదించాను. ప్రజల కోసం నేను మాటిస్తే దాని కోసం నేను నిలబడతాను. ఓటు చీలకూడదు అని చెప్పాను. నాకేం సరదా కాదు. నన్ను గుండెల్లో పెట్టుకునే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఓటు చీలకూడదు అని ఎందుకన్నానంటే.. మన పార్టీ కంటే కూడా మన ఏపీ నేల ముఖ్యం. నేను అసెంబ్లీలో ఉండి ఉంటే మెగా DSC కోసం ఈరోజు ఇంత పోరాటం జరిగేది కాదు.
YSRCP పతనం మొదలైంది. ప్రజలకు యువతకు ద్రోహం చేసారు. ఇక ఆ తప్పులు జరగనివ్వం. వాళ్లని అధికారంలోకి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన కొత్త ప్రభుత్వం జనసేన తెలుగు దేశం ప్రభుత్వమే ఉండబోతోంది. ఇంకోసారి ఏపీ ప్రజలు ఓట్లు చీలిపోయేలా తప్పులు చేయకూడదు. మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు జగన్ ఏ స్థాయికి పట్టుకెళ్లాడో తెలుసు. మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చాయి? దున్నపోతు ఈనింది చెంబు తీసుకురండి జున్ను పాలు ఇస్తాం అన్నట్లు జగన్ ప్రభుత్వం మాట్లాడుతోంది. జగన్ ప్రభుత్వం బాగుండి ఉంటే ఇప్పుడు వారాహి యాత్రకు ఇంత విశేషమైన జనాలు నాకోసం రారు. జగన్ బాగా పాలించి ఉంటే నేనే ఇలా యాత్రలు చేయను. ఈ వ్యక్తికి ఎంత డబ్బులు అవసరం ఉంది సర్ అని మొన్న మోదీని అడగాలనుకున్నా. (pawan kalyan)
నా సినిమాలు ఆపేసినప్పుడు నా దగ్గర డబ్బులు ఉండకూడదు నేను పార్టీని నడపకూడదు అని జగన్ ప్లాన్. కానీ ఈ విషయాలు నేను మోదీని అడగలేదు. ఆయనకు జగన్ ఎలాంటి వాడో తెలుసు. ఇది నా నేల. నేనే పోరాడుకుంటాను. మొన్న నన్ను పోలీసులు ఆపేసినప్పుడు ఎందుకు ఆపేసారో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాం. ఈ నేలపై పుట్టిన పింగళి వెంకయ్య ఆకలితో పోరాడుతూ చనిపోయారు. ఇలాంటివారి త్యాగాల వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకున్నాం. మనకు ప్రభుత్వం నచ్చకపోతే ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసి తీరాల్సిందే. మెగా DSC ఉద్యోగుల పక్షాన నిలబడతాను. 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ఓట్లు కొనడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఒకసారి ఆలోచించండి.
జగన్ లాంటి వ్యక్తితో పోరాడుతున్నానంటే నాకు ఈ నేలపై ఉన్న భక్తి. నేను ప్యాకేజీలు తీసుకున్నానని అంటున్నారు. ఆ సన్నాసులకు ఏం చెప్పాలో అర్థంకావడంలేదు. నాకు డబ్బు అవసరం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం ఉండి ఉంటే మాదాపూర్‌లో నాకు కోటి రూపాయలు సంపాదన ఉన్నప్పుడు నేను పది ఎకరాలు కొని పెట్టుకుని ఉంటే ఈరోజు వందల కోట్లు ఉండేది నా దగ్గర. కానీ నాకు అలాంటివాటిపై ఆసక్తి లేదు“” అని తెలిపారు పవన్. (pawan kalyan)