Pawan Kalyan: YSRCPది రూపాయి పావలా ప్రభుత్వం
వారాహి విజయ యాత్రలో (varahi yatra) భాగంగా పెడనలో (pedana) బహిరంగ సభ ఏర్పాటుచేసారు జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan). ఏపీలో అడుగుపెట్టాలంటే పాస్ పోర్ట్ వీసా తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని.. ఇలాగే వదిలేస్తే అధికార ప్రభుత్వం ఇంకెన్నో దాష్టీకాలకు పాల్పడుతుందంటూ ప్రసంగం మొదలుపెట్టారు.
“” నవరత్నాలు, ఇళ్లు ఇస్తాం అన్నారు. ఇవన్నీ వింటుంటే నేను నెల్లూరులో ఉన్నప్పుడు సంధులోకి రూపాయి పావలా అంటూ బొమ్మలు అమ్ముకుంటూ వచ్చేవారు. గుర్తుకొచ్చారు. కానీ వారు చేసేదంతా మోసం. YCP వారికి కూడా ఇదే రూపాయి పావలా స్ట్రాటెజీ. ఈ ప్రభుత్వమే రూపాయి పావలా ప్రభుత్వం. మనందరిదీ ఒకే గుండె చప్పుడు. మనలో విభేదాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రజానీకానికి వస్తే ఒకే దిశగా ఆలోచించాలి. దాడులు చేస్తున్న YCPని గద్దె దింపేలాగా.. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నవారిని తరిమేలా.. ఓటు చీలకుండా ఉండాలని 2021లో అన్ని పార్టీలు కలిసుండాలని పిలుపునిచ్చాను. జగన్ ఎన్నో అద్భుతాలు సాధించానని అంటున్నారు. ఈ మధ్యే సాథ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాల పనితీరు ఎలా ఉంది అని అడిగితే.. అత్యధిక లోపాలు ఏపీలో ఉన్నాయని తేలింది. జాతీయ ఉపాధి హామీ కింద కూలీల పొట్టగొట్టారు.
337 కోట్ల రూపాయలు దారి మళ్లించింది జగన్ ప్రభుత్వం. ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది మీకే వదిలేస్తున్నా. జనసైనికులు అక్రమ తవ్వకాలు అడ్డుకుంటే వారిపై అక్రమ కేసులు, TDPపై అక్రమ కేసులు పెట్టారు. నాకు చాలా బాధేసింది. ఎన్నో బూతులు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతారు. అయినా దేశభక్తిని గుండెల్లో నింపుకున్న మాకెందుకు భయాలు ఉంటాయి? భయపడేవాడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడు? మర్డర్లు చేసే నువ్వే గద్దె ఎక్కి కూర్చుంటే నాకెంత ఉండాలి? జగన్ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. ఆర్టీసీని విలీనం చేసి దాన్ని కొత్త ఉద్యోగాలని ప్రకటించారు. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎందుకు డీఎస్సీ కోసం పాటు పడుతున్న యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారు? ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే రూ.2 నుంచి 3 లక్షల వరకు స్థానిక మంత్రికి సమర్పించుకోవాలంట“” అని మండిపడ్డారు పవన్