Pawan Kalyan: వైసీపీని ఓడించి అప్పుడు త‌గ్గేదేలే అనండి

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు అచ్యుతాపురంలో చేస్తున్న‌ ప్ర‌చారంలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. ఈరోజు ఆయ‌న మండ‌పేట‌లో కూడా ప్ర‌సంగించారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు యువ‌కులు అల్లు అర్జున్ ఫోటోలు పెట్టుకొని త‌గ్గేదేలే అని కేక‌లు వేసారట‌. దీనిపై ప‌వ‌న్ స్పందించారు. సరే సంతోషం. నా ముందు చెప్ప‌డం కాదు. రేపు ఎన్నికల్లో కూట‌మికి ఓటు వేసి వైసీపీని దించి అప్పుడు చెప్పండి ఇదే డైలాగ్ అని తెలిపారు.