Pawan Kalyan: ఎమ్మెల్యేగా ఓడిపోతే.. సెంట్రల్ మినిస్టర్ పదవి?
Pawan Kalyan: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ధీమాతో ఉన్నాయి. మొన్న సోమవారం జరిగిన పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని కూటమి భావిస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై కూటమి సమాచారం సేకరించిందట.
దీంతో పాటు నేతలు ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితిని పార్టీల నాయకత్వాలు విశ్లేషించాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేసారట. అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారిన మరో అంశం ఏంటంటే.. పిఠాపురంలో ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఓడిపోతే.. సెంట్రల్ మినిస్టర్ పదవిని ఇస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్‌కు మాటిచ్చినట్లు టాక్.