Pawan Kalyan: 2033లో సీఎం.. ఓపిక పడతారా?
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక లేదు అని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు జనసేనాని. ఆయనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశే ఉంటే తెలుగు దేశం పార్టీతో చేతులు కలపడు.. మరో పదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా అనరు. పవన్ ప్లాన్ వేరే ఉంది. 2033లో ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందే జనసేన నేతలతో భేటీ అయ్యి తన ప్లాన్స్ అన్నీ వివరించారట. తనకు మాత్రం 2033లోనే సీఎం అవ్వాలని ఉందని.. అప్పటివరకు ఓపిక పట్టగలిగే వారే తన వెంట ఉండాలని కూడా చెప్పారట. అప్పటివరకు తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలైనన్ని ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అనుకుంటున్నారట. అప్పటికే చంద్రబాబు నాయుడుకు 85 ఏళ్లు వస్తాయి. కాబట్టి ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.