Pawan Kalyan: మీ అభిమానం ఓటుగా మారకపోతే నేను గెలవలేను
Pawan Kalyan: ఎక్కడికి వెళ్లినా అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలిపించలేకపోతే ఇక సీఎం ఎలా అవుతానని ప్రశ్నించారు. వైజాగ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు. అభిమానం ఓటుగా మారకపోతే తాను ఏమీ చేయలేనని తెలిపారు. తనకు కన్నీళ్లు సహజంగా రావని.. తన కన్నీళ్లు ఎండిపోయానని కానీ కొన్ని రోజుల క్రితం వైజాగ్ రోడ్లపై తనను ఆపేసినప్పుడు లక్షల్లో జనాలను చూసి తన కళ్లు చమర్చాయని తెలిపారు.
జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వాన్ని స్థాపించే బలం ఉండదని అందుకే లతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. మళ్లీ జగన్ సీఎం అయితే నిరుద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. ప్రజల కోసం తనని తాను తగ్గించుకుంటున్నానని చెప్పారు. ప్రజల బాగు కోసమే తాను పొత్తులకు పోవాల్సి వచ్చింది కానీ తనకు ఏ పార్టీతోనూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమిత్ షా లాంటి పెద్ద వారు తనకు హింట్ ఇస్తే తప్ప ఆడపిల్లల అదృశ్యం గురించి మాట్లాడలేనని.. వారి నుంచి సమాచారం వచ్చింది కాబట్టే ఆడపిల్లల అదృశ్య కేసుల గురించి మాట్లాడానని చెప్పారు. కానీ తన మాట ఎవరూ నమ్మలేదని అందరూ నవ్వుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.