Varahi: నాన్న కోరికను భీమ్లా నాయక్‌లో తీర్చగలిగాను
Tanuku: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan) వారాహి విజయ యాత్ర (varahi yatra) తణుకుకు చేరింది. తణుకు నియోజకవర్గ జనసైనికులు మరియు వీరమహిళలతో సమావేశంలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
“నా తండ్రి పోలీసు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమోషన్ వస్తే సీఐ లేదా ఏఎస్‌గా ఆగిపోతానేమో.. మీ అన్న ఎలాగో నా కోరిక తీర్చలేదు కనీసం నువ్వైనా సీఐగా ఉద్యోగం మొదలుపెట్టాలిరా అన్నారు. నేను ఆయన కోరికను భీమ్లా నాయక్ సినిమాతో తీర్చగలిగాను కానీ నిజ జీవితంలో తీర్చలేకపోయాను. నేను ఎందుకు చదువును మధ్యలో ఆపేసానో కూడా చెప్తాను. నాకు చేతకాక కాదు. నేను రోజూ 6, 7 గంటలు రాజ్యాంగం గురించే చదువుతుంటాను. మా అమ్మ నేను చదువుతుండడం చూసి ఈ చదివేదేదో చిన్నప్పుడే చదివి ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేవాడివి కదా అంటోంది. నేను ఐఏఎస్, ఐపీఎస్ అయ్యి ఉంటే జగన్ లాంటి వారికి సెల్యూట్ కొట్టాల్సి వచ్చేది. ఇలా జనాలను దోచుకునేవారికి నేనెందుకు సెల్యూట్ కొడతాను. జగన్ (ap cm jagan) నాకు శత్రువు కాదు. ఆయనపై నా పోరాటం కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపై పోరాడుతున్నా. జగన్ నాకు ఆనడు. ఈరోజు ఆ జలగలా జగన్ ఉన్నాడంతే. ఇప్పుడంటే ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరో 30 ఏళ్ల తర్వాత నేను ఉండకపోతే? ” (varahi yatra)
” నేను వాలంటీర్ల గురించి ఏదో తప్పుగా మాట్లాడేసానని YCP నాయకులు గింజుకుంటున్నారు. నేను మన ఆడపిల్లలను కాపాడుకోవాలని చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. నాలో విషయం లేనప్పుడు ప్రధాని మోదీ నాకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇస్తారు? నేను సీఎంని కాను కనీసం ఎమ్మెల్యేను కాను. అయినా ఆయనకు నేను నచ్చాను. ఎందుకంటే నా పాలసీలు ఆయనకి నచ్చాయి. నేను మోదీని కలవగానే జగన్ గురించి ఏదో కంప్లైంట్ చేసానని YCP వారు అనుకుంటున్నారు. నేనెందుకు కంప్లైంట్ చేస్తాను. జగన్ మన ఊర్లో తిరిగే పిల్లాడు. మన ఊర్లో తిరిగే పిల్లాడి గురించి హెడ్ మాస్టర్‌కి కంప్లైంట్ ఇచ్చినట్లు నేనెందుకు మోదీకి చెప్తాను? జగ్గూభాయ్ లాంటి వాడిని ఎదుర్కోవడానికి జనసేన చాలు కదా ” (varahi yatra)
“వైఎస్ షర్మిళ తెలంగాణలో పార్టీ పెడుతున్నారని తెలిసినప్పుడు మరిన్ని ఐడియాలజీలు ఉన్న పార్టీ రావాలని ఆమెకు సపోర్ట్ చేసాను. కానీ ఇప్పుడు ఆ పార్టీని ఉంచుతారో లేదో కూడా తెలీదు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణ కోసం TRSగా వచ్చిన పార్టీ BRS అయింది. ఎందుకంటే వారి ఐడియాలజీని మరింత విస్తరించాలని అనుకుంటున్నారు కానీ జనసేనకు ఆ అవసరం రాదు రాలేదు. జనసేన పార్టీ నమ్ముకున్న ఏడు సూత్రాలే భారతీయ రాజకీయాల్లో మార్పును తెస్తాయి ” (varahi yatra)
“మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. అత్తారింటిది దారేది నిర్మాత మన జనసేనలో చేరారు. మొన్న అన్నవరంలో నా చెప్పులు పోయినప్పుడు మచిలీపట్నంలో దొరికాయని తెలిసింది. అత్తారింటికి దారేది సినిమా ప్రింట్ కడపకు పంపితే మచిలీపట్నంలో పైరసీకి గురై లీకైంది. ఈ మచిలీపట్నం అనేది నా జీవితంలో కామన్ పాయింట్ అయిపోయింది“ అంటూ వైసీపీ నేత పేర్ని నానిపై కామెంట్స్ చేసారు పవన్. (varahi yatra)