Pawan Kalyan: అసెంబ్లీలో లేరు కాబట్టి సరిపోయింది.. సభలో పవన్ పవర్‌ఫుల్ స్పీచ్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. లంచాలు తీసుకునే అధికారులనే వదలడం లేదని.. అలాంటిది కోట్లకు కోట్లు దోచేసుకున్న వారిని ఎలా వదిలిపెట్టాలని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఉండి ఉన్నా నిలదీసేవాడనని. కానీ ఈరోజు వారు తప్పించుకోవడంతో బతికిపోయారని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షపడి తీరాల్సిందే అని తప్పు చేస్తే చిన్నా లేదు పెద్దా లేదు అందరికీ ఒకటే శిక్ష అని ప్రజలకు కూడా తెలిసొచ్చి వారు ధైర్యంగా బతుకుతారని తెలిపారు. పవన్ స్పీచ్‌తో సభలోని ఇతర నేతలు బల్లలు గుద్ది సంఘీభావం తెలిపారు.