Pawan Kalyan: పవన్ సంచలన కామెంట్.. పుష్ప సినిమా గురించేనా?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని అడవుల గుండా ఎర్రచందన అక్రమ రవాణాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రితో చర్చించారు. చర్చ అనంతరం పవన్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ సంచలన కామెంట్ ఒకటి చేసారు. “” ఇది వరకు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు, కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిపోయింది“” అని పవన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించే పవన్ పరోక్షంగా కామెంట్ చేసినట్లు అయ్యింది.