Pawan Kalyan: చంద్ర‌బాబుపై ప‌వ‌న్ స్పెష‌ల్ పోస్ట్

pawan kalyan says there is a lot to learn from chandrababu naidu

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నుంచి మ‌నం ఎంతో నేర్చుకోవాల‌ని అన్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ‌పెట్టిన డ్రోన్ల ద్వారా బాధితుల బాధ‌లు ఎలా త‌గ్గుముఖం ప‌ట్టాయో ఈ ఫోటోలు చూస్తేనే తెలుస్తోంద‌ని అన్నారు. దాదాపు 45 డ్రోన్ల ద్వారా బాధితుల‌కు నీళ్లు, ఆహారం, మందులు స‌ర‌ఫ‌రా చేసార‌ని అన్నారు. బాధ‌ల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు చంద్ర‌బాబు చేప‌ట్టే ప‌నుల‌ను ప్ర‌శంసించాల‌ని ఆయ‌న నుంచి చాలా నేర్చుకోవాల‌ని.. ఆయ‌న పాల‌న‌లో ప్ర‌జ‌లు కూడా చాలా స్ఫూర్తి పొందుతార‌ని స్పెష‌ల్‌గా ట్వీట్ చేసారు.