Pawan Kalyan: జగన్ నాతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాడు
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. 2019 ఎన్నికల సమయంలో ఇంకా జగన్ గెలవకముందు జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారట. ఇందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన పెద్దలను తన వద్దకు రాయబారానికి పంపాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2019 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేసి గెలిచేసారు. తనకు జనసేన లాంటి మరో పార్టీ తోడైతే కొత్తగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉంటుందని జగన్ అనుకున్నారట. కానీ జగన్‌తో కలిసేందుకు తాను ఇష్టపడలేదని దాంతో ఆ విషయాన్ని అక్కడే వదిలేసామని పవన్ వెల్లడించారు.
అప్పుడనే కాదు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు ముందు కూడా జగన్ పవన్‌తో పొత్తు పెట్టుకోవాలనుకున్నారట. జగన్ తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీతో కలవకముందు జగన్ ఈ ప్లాన్ వేసారని పవన్ తెలిపారు. ఇప్పుడు కూడా తాను ఒప్పుకోకపోయే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ వారు మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు.