Pawan Kalyan: డిప్యూటీ సీఎం.. నాకు ఓకే

pawan kalyan says he is ok with deputy cm post

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏ ప‌ద‌వి ద‌క్కబోతోంది అనేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. పిఠాపురం ఎమ్మెల్యేగానే కాకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జ‌న‌సేనాని అద్భుత విజ‌యాన్ని అందుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనే కాకుండా కేంద్రంలోనూ కింగ్ మేక‌ర్ అనిపించుకున్నారు. అందుకే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ప‌వ‌న్ ఒక తుఫాన్ అని కితాబివ్వ‌కుండా ఉండ‌లేక‌పోయారు.

అయితే.. నిన్న మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్యక్ర‌మానికి ప‌వ‌న్ కూడా వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఓ ఇంగ్లీష్ మీడియా ఛానెల్ ప‌వ‌న్‌ను ఓ ప్ర‌శ్న అడిగింది. స‌ర్ మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాబోతున్నారా అని అడ‌గ్గా.. త‌ప్ప‌కుండా తీసుకుంటాను అని చెప్పి వెళ్లిపోయారు. దాంతో ప‌వ‌న్ డిప్యూటీ సీఎం అవ్వ‌బోతున్నార‌ని ఇప్ప‌టి నుంచే జ‌న‌సైనికులు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.