Pawan Kalyan: YSRCPని ఇక తిట్ట‌ను కానీ…

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..(pawan kalyan) YSRCP నేత అంబ‌టి రాంబాబుపై (ambati rambabu) సెటైర్ వేసారు. మొన్న అవ‌నిగ‌డ్డ‌లో ప‌వ‌న్ వారాహి యాత్రాలో (varahi yatra) మాట్లాడుతూ..  YSRCP నేత‌ల‌ను సన్నాసులు అని తిట్టారు. దీనిని మ‌న‌సులో పెట్టుకుని అంబ‌టి రాంబాబు స్పందిస్తూ.. మేం స‌న్నాసుల‌మే.. నువ్వు సంసారివి క‌దా అని మండిప‌డ్డారు. ఇప్పుడు రాంబాబు అన్న మాట‌కి ప‌వన్ రియాక్ట్ అయ్యారు. “” స‌రే.. మీరు ఇంత ఫీల‌వుతున్నారు కాబ‌ట్టి నేను ఇక జీవితంలో మిమ్మ‌ల్ని స‌న్నాసులు అని తిట్ట‌కుండా ఉంటాను. కానీ అలా తిట్టించుకోకుండా ఉండేలా మీ ప్ర‌వ‌ర్త‌న ఉండాలి. అయినా నేను అస‌లు తిట్ట‌డం కూడా ఆపేసాను. ఎందుకంటే ఓడిపోబోతున్న పార్టీని తిట్ట‌డం దేనికి? నాకు YSRCPని చూస్తుంటే జాలేస్తోంది “” అని త‌న స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చారు ప‌వ‌న్.