Pawan Kalyan: సర్ మా అన్న‌య్య వ‌చ్చారు.. క‌లుస్తారా?

chiranjeevi pawan kalyan modi

Pawan Kalyan: ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో త‌న అన్న చిరంజీవి గురించి చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మోదీ, చంద్ర‌బాబు నాయుడు క‌లిసి ఫోటో దిగిన అనంత‌రం.. స‌ర్ మా అన్న‌య్య వ‌చ్చారు క‌లుస్తారా అని ప‌వ‌న్ మోదీని రిక్వెస్ట్ చేసారు. ఇందుకు మోదీ స‌రే అన‌డంతో చిరంజీవిని ఇక్క‌డి రా అన్న‌య్య అని ప‌వన్ పిలిచారు. అప్పుడు మోదీ ఆయ‌న రావ‌డం ఎందుకు మ‌న‌మే వెళ్దాం అని చిరు కూర్చున్న కుర్చీ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత మోదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. చిరంజీవి చేతులు ప‌ట్టుకుని అభివాదం చేయ‌డంతో వేడుక కేక‌ల‌తో హోరెత్తిపోయింది.